News December 21, 2025

TDP తిరుపతి జిల్లా బాస్ ఎవరంటే..?

image

అందరూ ఊహించినట్లే TDP తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి నియమితులయ్యారు. ఆమె 2019లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. 2024లో బీజేపీకి సీటు కేటాయించారు. అయినప్పటికీ టీడీపీని అంటిపెట్టుకోవడంతో జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డికి అవకాశం దక్కింది. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన ఆయనకు తుడా ఛైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News January 16, 2026

నల్గొండ: ఉద్యోగాల పేరిట రూ.85 లక్షల మోసం

image

విదేశాల్లో చదువు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ముప్పాళ్ల లీలాకృష్ణను చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీఎస్పీ రమేశ్ తెలిపారు. పోలేపల్లికి చెందిన కరుణభాయ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి, నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మూడు ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.85 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

News January 16, 2026

రోహిత్‌ కెప్టెన్సీకి గంభీర్ చెక్.. మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు!

image

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం వెనుక కోచ్ గంభీర్ హస్తం ఉండొచ్చని మనోజ్ తివారీ అనుమానం వ్యక్తం చేశారు. అగార్కర్ కోచ్ ప్రభావానికి లోనై ఉండొచ్చేమోనని, రోహిత్ లాంటి లెజెండ్‌ను పక్కన పెట్టడం క్రీడా ధర్మానికి విరుద్ధమన్నారు. 2027 వరల్డ్ కప్ ఆడగల సత్తా ఉన్న హిట్‌మ్యాన్‌ను కాదని గిల్‌కు బాధ్యతలు ఇవ్వడంలో లాజిక్ లేదన్నారు. ఇది రోహిత్‌ను అవమానించడమేనని ఫైర్ అయ్యారు.

News January 16, 2026

హనుమకొండ: ‘ఈనెల 18న ఖమ్మంలో సీపీఐ శత వార్షికోత్సవాల ముగింపు సభ’

image

జనవరి 18న సీపీఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరుగనున్న భారీ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం HNK బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.