News December 21, 2025

రాజంపేట: ఎల్లుండి బంద్

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో భాగంగా రైల్వేకోడూరు, రాజంపేటలో మంగళవారం బంద్ పాటించాలని రాజంపేట జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. రాజంపేటలోని R&B భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని షాపులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించాలని కోరారు.

Similar News

News January 17, 2026

సంగారెడ్డి: నేటి నుంచి సాంసద్ ఖేల్ మహోత్సవ్ పోటీలు

image

సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో ఈనెల 17 నుంచి 19 వరకు ‘సాంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఈవెంట్లు ఉంటాయని పేర్కొన్నారు. 15 నుంచి 21 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.

News January 17, 2026

50 ఏళ్ల క్రింద మేడారం జాతర.. ఫొటోలు

image

TG: దాదాపు 5 దశాబ్దాల క్రితం మేడారం జాతర ఎలా ఉండేదో తెలిపే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు సమ్మక్క ఆగమనం, జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. మొక్కులు సమర్పిస్తున్న భక్తుల జనసందోహం అద్భుతంగా ఉంది. 1970 నాటి ఈ అరుదైన చిత్రాలను ఓ మ్యాగజైన్‌లో ప్రచురించారు.

News January 17, 2026

జన్నారం: వ్యక్తిని చంపేందుకు యత్నం.. ఐదుగురి అరెస్ట్

image

మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో జన్నారం మండలంలోని లింగయ్యపల్లి గ్రామానికి చెందిన ఉడుతల చిన్న గంగయ్యను విద్యుత్ షాక్ పెట్టి చంపడానికి ఐదుగురు వ్యక్తులు యత్నించారు. వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ అనూష తెలిపారు. జనవరి 12న గంగన్న కొత్త పుట్టిగూడలో తన గొర్రెల దొడ్డి వద్ద పడుకున్నాడు. అర్ధరాత్రి వారు విద్యుత్ షాక్ పెట్టి అతడిని చంపే ప్రయత్నం చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.