News December 21, 2025

వరంగల్: గాదె ఇన్నయ్య ఆశ్రమంలో NIA తనిఖీలు

image

జఫర్‌ఘడ్‌లోని గాదె ఇన్నయ్య నడుపుతున్న మా ఇల్లు గాదె ఇన్నయ్య ఆశ్రమంలో NIA పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్ట్‌గేషన్ అధికారులు గాదె ఇన్నయ్యను విచారిస్తున్నారు. ఇటీవల ఇన్నయ్య హిడ్మా కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన్నట్లు సమాచారం రావడంతో ఆయన్ను NIA అధికారులు ప్రశ్నించారు. అలాగే మాజీ నక్సల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 20, 2026

వనపర్తిని మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలి- కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డితో కలిసి నార్కోటిక్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్నారు.

News January 20, 2026

మెట్రో ఫేజ్-2: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

image

TG: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2కు వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి CM రేవంత్ లేఖ రాశారు. ఇదే విషయమై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. గతంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ కలిసినట్లు గుర్తుచేశారు. ఫేజ్-2 నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటును CM లేఖలో ప్రస్తావించారు.

News January 20, 2026

నల్గొండ: M. Ed విద్యార్థులకు అలర్ట్

image

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed semester-3 (R-23) రెగ్యులర్‌కు సంబంధించిన పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి-10 నుంచి ఫిబ్రవరి-23 మధ్య జరుగుతాయి అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని కోరారు.