News December 21, 2025

‘కెరీర్ మినిమలిజం’.. Gen Zలో కొత్త ట్రెండ్.. ఏంటిది?

image

ఆఫీసుల్లో రాత్రి పగలు కష్టపడే హజిల్ కల్చర్‌కు Gen Z చెక్ పెడుతోంది. దీన్నే కెరీర్ మినిమలిజం అంటున్నారు. అంటే పని పట్ల బాధ్యత లేకపోవడం కాదు. ప్రమోషన్లు, హోదాల వెంట పడకుండా ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం. మేనేజర్ పోస్టుల్లో ఉండే స్ట్రెస్ కంటే మెంటల్ హెల్త్, పర్సనల్ లైఫ్ ముఖ్యమని వీరు భావిస్తున్నారు. 72% మంది టీమ్ మేనేజ్‌మెంట్ కంటే స్కిల్స్ పెంచుకోవడానికే ఇష్టపడుతున్నారు.

Similar News

News December 27, 2025

కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఈ పనులు చేయాలట!

image

2026లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, ఇంటిముందు ముగ్గులు వేసి తులసి కోటను పూజించాలి. తులసి మొక్కకు ఎరుపు దారం కట్టి విష్ణు మంత్రాలు జపించాలి. ఇది ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి, ఆవుకు గ్రాసం తినిపించాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది’ అంటున్నారు.

News December 27, 2025

తల్లిదండ్రులు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

image

తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్ల వల్లే పిల్లలకు మాటలు లేట్‌గా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఆరునెలలు రాగానే ఘనపదార్థాలు నెమ్మదిగా అలవాటు చెయ్యాలి. అప్పుడే నాలుకకు వ్యాయామం అందుతుందంటున్నారు. అలాగే సిప్పీ కప్పుల వాడకం తగ్గించాలి. దీనివల్ల కూడా మాటలు ఆలస్యమవుతాయని చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాటలు రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News December 27, 2025

భారీ జీతంతో AVNLలో ఉద్యోగాలు

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌ (<>AVNL<<>>) 6 కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీటెక్, బీఈ, పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. కన్సల్టెంట్‌కు బేసిక్ పే రూ.1,20,000, Sr. మేనేజర్‌కు రూ.70,000, Jr. మేనేజర్‌కు రూ.30వేలు చెల్లిస్తారు.వెబ్‌సైట్: www.avnl.co.in