News December 21, 2025

నెల్లూరు TDPలో BCల హవా..!

image

పార్టీ ఏదైనా నెల్లూరు రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గ నేతలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. TDP ట్రెండ్ మార్చి బీసీలకు ప్రాధాన్యమిస్తోంది. TDP జిల్లా అధ్యక్ష పదవికి పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మరికొందరు గట్టిగా ప్రయత్నించారు. కానీ MLC బీద రవిచంద్రకు మూడోసారి ఈ పదవిని అప్పగించారు. నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్, రాజ్యసభ ఎంపీగా బీద మస్తాన్ రావు ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News December 26, 2025

నెల్లూరులో ఆయనో డిఫరెంట్ MLA..?

image

నెల్లూరు జిల్లాలో తొలిసారి గెలిచిన ఓ MLA తీరును సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉంటున్న వారిని సైతం దూరం పెట్టేస్తున్నారంట. తాను తప్ప నియోజకవర్గంలో ఎవరూ పెత్తనం చలాయించడానికి లేదని ముఖాన చెప్పేస్తున్నారంట. తనకు గిట్టని వాళ్లను హైలెట్ చేసేలా సొంత పార్టీ నాయకులు ఫ్లెక్సీలు వేసినా ఊరుకోవడం లేదంట. దగ్గరుండి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన నేతకు సైతం ఆయన శత్రువుగా మారారట.

News December 26, 2025

నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎంని కోరా: ఆనం

image

రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నెల్లూరులో మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

News December 26, 2025

నెల్లూరు: 104 వాహనాల్లో ఉద్యోగావకాశాలు

image

జిల్లాలోని 104 వాహనాల్లో డ్రైవర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డీఈవోలకు డిగ్రీ, కంప్యూటర్ కోర్సు, డ్రైవర్లకు టెన్త్ పాస్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు bhspl.in/careers ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని TB జిల్లా కార్యాలయంలో ఈనెల 27, 28 తేదీలలో సంప్రదించాలని కోరారు.