News December 21, 2025
టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తేజోవతి

టీడీపీ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా మోజోరు తేజోవతిని నేడు పార్టీ అధిష్ఠానం నియమించింది. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి టీడీపీలో చేరిన తేజోవతి పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేయడంతో ఈ బాధ్యతను అప్పగించారు. తేజోవతి ప్రస్తుతం గిరిజన సలహా మండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణరావును పార్టీ అధిష్ఠానం నియమించింది.
Similar News
News December 31, 2025
భవిష్యత్‌లో మా టార్గెట్లు ఇవే: కడప ఎస్పీ

రాబోయే రోజుల్లో కడప జిల్లాను సాంకేతిక మరింత మెరుగుపరిచేలా చేస్తామని SP నచికేత్ తెలిపారు. AIను ఉపయోగించుకొని కార్యాలయ పనులు, రహదారి భద్రత పెంచుతామన్నారు. దర్యాప్తులను సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. PGRSలో వచ్చిన ఫిర్యాదులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో రౌడీయిజం లేకుండా చేస్తామన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గేలా చూస్తామన్నారు.
News December 31, 2025
ఆయిల్‌పామ్ సాగు, మొక్కల ఎంపికలో జాగ్రత్తలు

ఆయిల్‌పామ్ సాగు కోసం 12 నెలల వయసు, 1 నుంచి 1.2మీ ఎత్తు, 20-25 సెం.మీ. కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు (హెక్టారుకు 143 మొక్కలు), చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు (హెక్టారుకు 123 మొక్కలు) నాటుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 31, 2025
ఒత్తు పొత్తును చెరుచు

ఒంటి ఎద్దుతో సేద్యం చేసేటప్పుడు నాగలి లేదా కాడిని ఎద్దు మెడపై సరిగా పెట్టకుండా, ఒక పక్కకే ఎక్కువ ఒత్తు (ఒత్తిడి) పడేలా చేస్తే, అది ఎద్దు మెడపై పొత్తు (చర్మం) దెబ్బతినడానికి, వాపు రావడానికి కారణమవుతుంది. అందుకే సేద్యం చేసేటప్పుడు కాడి భారం ఎద్దు భుజాలపై సమానంగా పడాలి. ఎద్దుకు నొప్పి కలిగితే అది సరిగా నడవలేదు, దీనివల్ల సేద్యం ఆలస్యమవుతుంది, పశువు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని ఈ సామెత చెబుతుంది.


