News December 21, 2025
టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తేజోవతి

టీడీపీ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా మోజోరు తేజోవతిని నేడు పార్టీ అధిష్ఠానం నియమించింది. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి టీడీపీలో చేరిన తేజోవతి పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేయడంతో ఈ బాధ్యతను అప్పగించారు. తేజోవతి ప్రస్తుతం గిరిజన సలహా మండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణరావును పార్టీ అధిష్ఠానం నియమించింది.
Similar News
News December 27, 2025
వరంగల్ నగరంలో పెరిగిన నేరాలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు 2024 కంటే ఈ ఏడాది నేరాలు ఎక్కువయ్యాయి. గత ఏడాది 14,406 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 14,456 కేసులు నమోదయ్యాయి. హత్యలు 37 గత ఏడాది కాగా, ఈ ఏడాది 36 హత్యలు నమోదయ్యాయి. కిడ్నాప్ లు 183 పాతవి ఉండగా ప్రస్తుతం 148 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. దొంగతనం కేసులో గత ఏడాది 421 ఉండగా, ఈ ఏడాది 434 దొంగతనాలు జరిగాయి.
News December 27, 2025
కృష్ణా: మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.!

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
News December 27, 2025
అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే?

క్రికెట్‌లో భారత్ అనగానే ఒంటికాలి మీద వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. మన పిచ్‌ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని నోటికొచ్చిన మాటలన్నారు. అలాంటి వాళ్లు AUS పిచ్‌లపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో NOV 21న పెర్త్‌లో తొలి టెస్ట్, ఇవాళ మెల్‌బోర్న్‌లో 4వ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. మన పిచ్‌లను క్రికెట్‌కు ప్రమాదంగా అభివర్ణించినవాళ్లు ఇప్పుడు మూగబోవడం వింతగా ఉంది.


