News April 21, 2024

విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను

image

విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనును పార్టీ ప్రకటించింది. గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ఆయన పోటీచేశారు. ఆయన సేవలను అధిష్ఠానం గుర్తించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలని శ్రీను కోరారు.

Similar News

News March 11, 2026

VZM: సీఎం సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

image

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, GSDP లక్ష్యాలు, జిల్లాల్లో అమలవుతున్న విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం, పెట్టుబడులపై చర్చించారు.

News March 11, 2026

VZM: కేంద్రీయ విద్యాలయంలో జాతీయ సదస్సు ప్రారంభం

image

విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సుస్థిర రసాయన శాస్త్రం–2026” అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. సదస్సులో సుస్థిర రసాయన పరిశోధనల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై పలువురు శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.

News March 11, 2026

VZM: ‘హౌసింగ్ ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

image

రాష్ట్రంలో 500 చదరపు మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్లు పైబడిన ప్రతి హౌసింగ్ ప్రాజెక్ట్ తప్పనిసరిగా ఏపీ రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీ రెరా ఛైర్మన్ ఆర్.ఎస్. శివారెడ్డి తెలిపారు. పట్టణంలోని ఓ హోటల్‌లో రెరా చట్టం–2016పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రెరా చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.