News December 21, 2025

భూపేశ్ రాజకీయ ప్రస్థానం ఇదే.!

image

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి ఎంపికైన విషయం తెలిసిందే. ఆయన 1985 అక్టోబర్ 17న జన్మించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2009-10లో కడప జిల్లా కాంగ్రెస్ యువజనాధ్యక్షుడిగా పనిచేశారు. మైలవరం ZPTCగా 2014లో గెలిచారు. 2021లో TDPలో చేరి జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకొని 2024లో MLA సీటు ఆశపడి నిరాశ పడ్డారు. పార్టీ అధిష్ఠానం మేరకు కడప ఎంపీగా పోటీ చేసి 66,000 ఓట్లతో ఓటమి చెందారు.

Similar News

News January 18, 2026

కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కడప జిల్లాతో NTRకు అనుబంధం.. మీకు తెలుసా!

image

దివంగత నేత NTRకు కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. NTR 1983లో తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారం కోసం చైతన్య రథంలో హరికృష్ణ డ్రైవర్‌గా రోడ్డు షో నిర్వహించారు. ఈ యాత్ర తాళ్ల ప్రొద్దుటూరు, పాతచౌటపల్లి, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా సాగింది. పాతచౌటపల్లి చిత్రావతి నదిలో చైతన్య రథం మొరాయించడంతో అక్కడే ఆయన బస చేశారు. తిరిగి 1984లో పులివెందుల, కొండాపురం తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. నేడు NTR వర్ధంతి.