News December 21, 2025

NTR జిల్లాలో త్వరలో ‘ఆంధ్రా టాక్సీ’ సేవలు

image

ప్రైవేట్ క్యాబ్ సంస్థల అధిక ఛార్జీల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ‘ఆంధ్రా టాక్సీ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. సామాన్యులకు తక్కువ ధరకే ఆటో, టాక్సీ సేవలు అందించడమే లక్ష్యంగా NTR జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనున్నారు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో నడిచే ఈ యాప్ వల్ల పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రవాణా సులభతరం కానుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

Similar News

News January 15, 2026

సూర్యాపేటలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

image

1.సూర్యాపేట 48: ST 4, SC 7, BC 13, UR 24.
2.తిరుమలగిరి 15: ST 1, SC 3, BC 3, UR 8.
3.కోదాడ 35: ST 2, SC 5, BC 10, UR 18.
4. హుజూర్‌నగర్ 28: ST 1, SC 4, BC 9, UR 14.
5.నేరేడుచర్ల 15: ST 1, SC 3, BC 3, UR 8.

News January 15, 2026

ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

image

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్‌ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.

News January 15, 2026

MOIL లిమిటెడ్‌లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>MOIL<<>> లిమిటెడ్‌లో 67 గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech(మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ), MSc( జియాలజీ), PG(సోషల్ వర్క్)ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBDలకు ఫీజులేదు. సైట్: https://www.moil.nic.in