News December 21, 2025
విష్ణు వైభవం: సర్వశక్తిమంతమైన రూపాలు

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః|
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః||
శ్రీనివాసుడు మనకు వెలుగునిస్తాడు. ధర్మాన్ని తప్పిన వారిని శిక్షిస్తాడు. హంస రూపుడు, గరుత్మంతుడు, సర్పశ్రేష్ఠుడు, పద్మనాభుడు అయనే. కఠిన తపస్సు ఆయనే, సకల జీవుల పుట్టుకకు కారణం ఆయనే. అణువణువులో, అనంతంలో ఉన్న ఆయనని పూజించాలి. సృష్టిలోని ప్రతి జీవిని గౌరవించాలి. సత్కర్మలతో ఆ వెలుగును చేరుకోవాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
Similar News
News January 15, 2026
TODAY HEADLINES

⁎ తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
⁎ జర్నలిస్టుల అరెస్ట్.. ఖండించిన బండి సంజయ్, YS జగన్, KTR
⁎ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
⁎ ఢిల్లీలో పొంగల్ వేడుకలు.. పాల్గొన్న పీఎం మోదీ
⁎ రూ.15,000 పెరిగిన వెండి ధర
⁎ రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం
⁎ ఇరాన్‌ను వీడాలని భారతీయులకు ఎంబసీ సూచన
News January 15, 2026
WPL: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (36) శుభారంభం ఇవ్వగా, లిజెల్లీ లీ (67) చెలరేగి ఆడి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ, ఈ గెలుపుతో టోర్నీలో తన ఖాతాను తెరిచింది.
News January 15, 2026
మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

TG: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, ఎస్సీ జనరల్ 9, SC మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ST మహిళలకు 2 స్థానాలు కేటాయించింది. 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీకి ఒక స్థానంలో కేటాయింపులు చేసింది. ఈ నెల 17లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.


