News December 21, 2025

బీజేపీకి భారీగా విరాళాలు

image

2024-25లో రాజకీయ పార్టీలకు ₹3,811 కోట్ల డొనేషన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా ఇవి అందాయి. బీజేపీకి ఏకంగా ₹3,112 కోట్లు (82%) రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు ₹299 కోట్లు(8%), ఇతర పార్టీలకు ₹400 కోట్లు (10%) వచ్చాయి. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలివ్వడాన్ని సుప్రీంకోర్టు గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. 2023-24లో ₹1,218 కోట్ల విరాళాలు వచ్చాయి.

Similar News

News January 1, 2026

UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

image

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్‌‌ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు వల్ల కలిగే నష్టం

image

మారుకా మచ్చల పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో మినుము పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటంవలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ తెగులును సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టం తప్పదు.

News January 1, 2026

భారీ జీతంతో 79 పోస్టులకు నోటిఫికేషన్

image

TG: కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో 79 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 44 అసోసియేట్ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిజిస్ట్రార్ భగవాన్ తెలిపారు. ఈ నెల 31 సా.4 గంటల వరకు యూనివర్సిటీలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రొఫెసర్‌కు రూ.1.44L-2.18L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.31L-2.17L జీతంగా పేర్కొంది. అర్హత, ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.