News December 21, 2025

మంచిర్యాల: 3,700 కేసులు పరిష్కారం

image

మంచిర్యాల జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 9 లోక్ అదాలత్ బెంచ్‌లలో 3,700 కేసులు పరిష్కరించినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ తెలిపారు. 15 సివిల్ ధావాలు, 5 వాహన పరిహారం, 3, 650, క్రిమినల్, 33 సైబర్ క్రైమ్, 75 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.

Similar News

News January 16, 2026

వార్డుల రిజర్వేషన్లు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

image

మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను జీవో ప్రకారం అత్యంత పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్లు రిజర్వేషన్ పట్టికలను సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. గణాంకాలు, రొటేషన్ పద్ధతి, గత డేటాను పరిశీలించాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News January 16, 2026

ప.గో: సుడి తిరిగింది.. కారు, రూ.20 లక్షల క్యాష్ ప్రైజ్!

image

ఉంగుటూరు(M) నారాయణపురం దండుదారిపుంత బరిలో నిడమర్రు మండలం పత్తేపురానికి చెందిన పొత్తూరి నరసింహరాజుని అదృష్టం వరించింది. బరిలో నిర్వహించిన లక్కీ డ్రాలో రూ.25 లక్షల విలువైన కారును గెలుచుకోగా, పందేల్లో మరో రూ.20 లక్షల గెలుపొందారు. మొత్తంగా రూ.45 లక్షల సొంతం చేసుకున్న విజేతకు ఎమ్మెల్యే ధర్మరాజు కారును అందజేశారు.

News January 16, 2026

గద్వాల్: పెళ్లి ఆగిపోవడంతో యువకుడి సూసైడ్

image

వివాహం ఆగిపోయిందని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల్ జిల్లాలోని మానవపాడులో చోటుచేసుకుంది. గురువారం స్థానిక యువతితో పెళ్లి జరగాల్సి ఉండగా నిలిచిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంతకళ్యాణ్ రెడ్డి (33) నిన్న ఉదయం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై స్వాతి తెలిపారు.