News December 21, 2025
బాపట్ల: రాజశేఖర్ బాబు ప్రస్థానమిదే..!

బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ BUDA సలగల రాజశేఖర్ బాబు తండ్రి బెంజిమెన్ బాపట్ల MPగా 1989లో ఎన్నికయ్యారు. రాజశేఖర్ BSP పార్టీ తరఫున 1998లో బాపట్ల MPగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం TDPలో చేరారు. గత ఐదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, పార్టీ పట్ల చూపిన విధేయతను అధిష్ఠానం గుర్తించింది. BUDA ఛైర్మన్‌గా ఉన్న ఆయనకు అధిష్ఠానం తాజాగా జిల్లా పార్టీ పగ్గాలను కట్టబెట్టింది.
Similar News
News January 9, 2026
మే 3న నీట్.. సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

జిల్లాలో మే 3న జరగనున్న నీట్-2026 (యూజీ) పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఈ నెల 15 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో విజయలక్ష్మీ, నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2026
రూ.425 కోట్లతో పెనుకొండలో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

పెనుకొండలోని ఘనగిరి లక్ష్మీనరసింహ స్వామి కొండపై ₹425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 60 ఎకరాల్లో నిర్మించే ఈ కేంద్రంతో 4,035 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పెనుకొండకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News January 9, 2026
BHPL: ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే పథకాలకు అర్హత!

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి రైతు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐడీ నంబర్ ఉంటేనే పీఎం కిసాన్ తదితరాలకు అర్హత ఉంది. పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, మొబైల్
నంబర్‌తో వ్యవసాయ శాఖ ఆఫీసుకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జిల్లాలో 1,24,479 మంది రైతులు ఉండగా, 53,792 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.


