News December 21, 2025
తూ.గో: ఇక ప్రతి ఆదివారం పండగే..!

రాష్ట్రంలో ఇక నుంచి ప్రతి ఆదివారం విద్యార్థులు, ఉద్యోగుల కోసం ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం మండపేటలో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి మంత్రి ఆటపాటల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో MLA వేగుళ్ల జోగేశ్వరరావు, కమిషనర్ రంగారావు పాల్గొన్నారు.
Similar News
News December 31, 2025
బొకేలు వద్దు.. విద్యార్థులకు తోడ్పాటునివ్వండి: కలెక్టర్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విజ్ఞప్తి చేశారు. వాటిపై చేసే ఖర్చును పేద విద్యార్థుల చదువుకు ఉపయోగపడేలా మలచాలని సూచించారు. బొకేలకు బదులుగా నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు లేదా పేదలకు ఉపయోగపడే దుప్పట్లు అందజేయాలని కోరారు. వీటిని అవసరమున్న విద్యార్థులకు, నిరుపేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
News December 31, 2025
నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌కి రిమాండ్

ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ గడువు పొడిగించింది. ఈ కేసులో బుధవారం విజయవాడ కోర్టులో విచారణ చేపట్టారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేశ్, జోగి రాముతో సహా మిగిలిన నిందితులకు జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ పడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఉన్నతాధికారులు నిందితులను తిరిగి జిల్లా జైలుకు తరలించారు.
News December 31, 2025
మ్యూచువల్ ఫండ్ల రికార్డు జోరు.. ఏడాదిలో ₹14 లక్షల కోట్లు జంప్

2025లో మ్యూచువల్ ఫండ్ల మార్కెట్ దుమ్మురేపింది. సామాన్యులు SIPల ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఈ ఏడాది పరిశ్రమ ఆస్తుల విలువ ఏకంగా ₹14 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం ఆస్తుల విలువ (AUM) రికార్డు స్థాయిలో ₹81 లక్షల కోట్లకు చేరింది. సుమారు 3.3 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లు చేరడం విశేషం. విదేశీ సంస్థలు వెనక్కి తగ్గుతున్నా.. మనవాళ్ల SIP పెట్టుబడులు మార్కెట్‌ను బలంగా నిలబెట్టాయి.


