News December 21, 2025
పెద్దపల్లి: ‘పులి సంచారంపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’

పెద్దపల్లి జిల్లాలోని ఎన్‌టీపీసీ, మల్యాలపల్లి, కుందనపల్లి, రాయదండి, లింగాపూర్, పాముల పేట, మేడిపల్లి, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, కమాన్పూర్, రామగిరి ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. కావున సంబంధిత మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య వ్యవసాయ క్షేత్రాలలో సందర్శించవద్దని తెలిపారు.
Similar News
News January 11, 2026
పాకిస్థాన్‌కు యుద్ధం చేసే ధైర్యం లేదు: మనోజ్ కటియార్

ఇండియాతో నేరుగా యుద్ధం చేసే ధైర్యం పాకిస్థాన్‌కు లేదని వెస్టర్న్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదమే పాక్ ఏకైక ఆయుధమని, పరోక్ష యుద్ధంతోనే భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మానెక్‌షా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్తతలకు అవకాశం ఉందని హెచ్చరించారు. భారత సైన్యం బలం భిన్నత్వంలో ఏకత్వమని అన్నారు.
News January 11, 2026
గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

గండికోట ఉత్సవాలలో నేడు(మొదటి రోజు) కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
➤ సాయంత్రం 4:00 – 5:30 గం.వరకు శోభాయాత్ర
➤ 5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
➤ 6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
➤ రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
➤ రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
➤ రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
➤ రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ.
News January 11, 2026
రామారెడ్డి: ఎమ్మెల్యే బ్యాటింగ్.. ఎంపీడీవో బౌలింగ్

రామారెడ్డి మండల కేంద్రంలో యువజన నాయకులు నిర్వహిస్తున్న రామారెడ్డి ప్రీమియర్ లీగ్-2026 క్రికెట్ టోర్నమెంట్ శనివారం జరిగింది. మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు జడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన పోటీల్లో పాల్గొని బ్యాటింగ్ చేశారు. నాగిరెడ్డిపేట్ ఎంపీడీవో కురుమ ప్రవీణ్ బౌలింగ్ వేశారు. యువకులతో కలిసి క్రికెట్ ఆడినందుకు ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు.


