News April 21, 2024
చేతులు కలిపిన వసంత, దేవినేని

AP: మైలవరం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులు మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతులు కలిపారు. తన తరఫున ప్రచారం చేయాలని ఉమాను వసంత కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసికట్టుగా పనిచేయాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. రేపు వసంత నామినేషన్ కార్యక్రమంలో దేవినేని పాల్గొననున్నారు.
Similar News
News March 24, 2026
యుద్ధం.. బీర్లు తాగేవారికి షాక్!

దేశంలో బీర్ల ధరలు పెరుగుతాయని, సరఫరాకు కొరత ఏర్పడొచ్చని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(BAI) తెలిపింది. ‘యుద్ధం వల్ల తయారీ ఖర్చు 12-15% పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ధరలు ఉన్నాయి’ అని పేర్కొంది. సీసాల ధరలు 20%, మెటీరియల్స్ రేట్లు 20-25%, రవాణా ఖర్చులు 10% పెరిగాయి. BAIలోని యునైటెడ్ బ్రూవరీస్, కార్ల్స్‌బర్గ్, AB InBev తదితర కంపెనీలు దేశంలో 85% బీర్లు అమ్ముతున్నాయి.
News March 24, 2026
సినీ పరిశ్రమ అభివృద్ధిపై CM CBNతో సంజయ్ దత్ భేటీ

AP: CM CBNతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, షూటింగ్‌లకు APని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్ దత్ వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని CM తెలిపారు.
News March 24, 2026
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచలేం: SC

AP, TGల్లో మిగిలిన 623 PG మెడికల్ సీట్ల భర్తీపై PVT కాలేజీలకు SCలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే ఏడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా గడువు కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అకడమిక్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కాలేజీలు కేంద్రాన్ని సంప్రదించొచ్చని సూచించింది. కేంద్రం మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.


