News December 21, 2025
ములుగు: రేపు యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి వినతుల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించలేదన్నారు. కోడ్ ముగిసినందున ప్రతి సోమవారం వినతుల స్వీకరణ ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News December 26, 2025
పార్వతీపురం జిల్లాలో ఘనంగా వీర్ బాల్ దివాస్-2025 వేడుకలు

భవిష్యత్తుకు పునాదిగా ఉన్న చిన్న పిల్లలను గౌరవించేందుకు ఈ వేదిక అని జిల్లా కలెక్టర్ డా.ఎం.ప్రభాకర రెడ్డి అన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 26న నిర్వహించే ‘వీర్ బాల్ దివాస్’ వేడుకలు మన్యం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం పార్వతీపురంలోని ఆర్సీఎం పాఠశాలలో అవగాహన ర్యాలీ ప్రారంభించారు. చిన్న వయస్సులోనే అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన సాహిబ్‌జాదాల చరిత్ర నేటి తరం పిల్లలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
News December 26, 2025
నాగర్ కర్నూల్: కవిత పర్యటన వివరాలు

ఎమ్మెల్సీ కవిత శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏలూరు పంప్ హౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 11 గంటలకు పెంట్లవెల్లిలో రుణమాఫీ కాని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మెడికల్ కాలేజ్, వట్టెం రిజర్వాయర్, సిర్సవాడ బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
News December 26, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్: ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. డే విజన్, నైట్ విజన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ మద్యపానం, గంజాయి విక్రయాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ డ్రోన్ల వినియోగం ఎంతో కీలకంగా మారుతుందని ఆయన వివరించారు.


