News December 21, 2025
బాపట్ల జిల్లాలో ఎంతమందికి పోలియో చుక్కలు వేశారంటే..!

బాపట్ల జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు DMHO విజయమ్మ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1,45,098 మంది చిన్నారులు ఉండగా వారిలో 1,09,683 మందికి ఆదివారం పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన పిల్లలకు సోమ, మంగళవారం వైద్య సిబ్బంది గృహ సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు సహకరించాలన్నారు.
Similar News
News January 14, 2026
జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.
News January 14, 2026
ఆర్థిక సంఘం నిధులు వచ్చేస్తున్నాయ్!

TG: సుమారు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి నిలిచిపోయిన గ్రామపంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పడగా జీపీలకు త్వరలో 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. రాష్ట్రానికి రూ.2,500Cr పెండింగ్ ఉండగా ఈ నెలాఖరు నాటికి రూ.1000Cr, వచ్చేనెల రూ.1500Cr కేంద్రం రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ప్రతి జీపీకి ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్‌తో నిధులను వినియోగిస్తారు.
News January 14, 2026
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


