News December 21, 2025
తిరుపతి: మీ వాట్సప్‌కు ఈ మెసేజ్ వచ్చిందా.?

వాట్సాప్ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP సుబ్బరాయుడు తెలిపారు. హాయ్.. మీ ఫోటో చూశారా?”, “ఇది నువ్వేనా?” వంటి సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఇవి ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌కు సంబంధించినవని, లింక్ ఓపెన్ చేస్తే వాట్సాప్ ఖాతా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News December 29, 2025
బాధిత కుటుంబానికి మృతదేహం అప్పగింత

ఎలమంచిలి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70) అనే వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. బి.1 భోగి లో వున్న అతను తన వద్ద ఉన్న డబ్బు బ్యాగుతో బయటికి వచ్చే సమయంలో మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు.ఎలమంచిలిలో శవ పంచనామా, పోస్టుమార్టం అనంతరం చంద్రశేఖర్ సుందర్ మృతదేహాన్ని విజయవాడ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులకు అప్పగించామని రైల్వే పోలీసులు చెప్పారు.
News December 29, 2025
మిగిలింది గ్రేటర్ హైదరాబాదే!

TGలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు EC సమాయత్తం అవడంతో గ్రేటర్‌లో చర్చ మొదలైంది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ ఇదే కావడంతో ఇక్కడి పీఠం మీద ప్రధాన పార్టీలు గురి పెడుతున్నాయి. ఓ వైపు సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడేమో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు EC ప్రిపేర్ అవుతోంది. అయితే, GHMC పాలకవర్గం FEB-2026లోనే ముగియనుంది. దీంతో HYDలో ఎన్నికలు ఎప్పుడు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
News December 29, 2025
వింటర్ ఎఫెక్ట్.. ములుగు జిల్లాకు ఎల్లో అలెర్ట్

ములుగు జిల్లాను చలి వణికిస్తోంది. 10 మండలాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. ఈరోజు మేడారంలో అతి తక్కువగా 10.4డిగ్రీ సెంటిగ్రేడ్, వెంకటాపురం మండలం ఆలుబాకలో 13.7డిగ్రీల చలి ఉంటుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప రాత్రి వేళలో బయటికి రావద్దని సూచించారు.


