News December 21, 2025
ఇటుకల బట్టీలు వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసిన Dy DMHO

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎంహెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.
Similar News
News January 11, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

కంచిలి హైవేపై మూడు వాహనాలు ఢీ..తప్పిన ప్రమాదం
పలాసలో నాటు తుపాకీతో బెదిరించిన వ్యక్తి అరెస్ట్
సంతబొమ్మాళి: మత్స్యకారుడు మృతి
క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే కూన
శ్రీకాకుళం: గుడ్డు ధర ఆల్ టైం రికార్డ్
పాతపట్నంలో పోలీసుల దాడులు
నౌపడ, శ్రీముఖలింగం, కడుము గ్రామాల్లో పూర్వ విద్యార్థుల కలయిక
దేశ రక్షణలో సైనికుల సేవలు హర్షణీయం: ఎమ్మెల్యే శంకర్
News January 11, 2026
శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం

శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం ఆయనను ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. కుటుంబ సభ్యులు వైద్యుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులిటెన్ విడుదల కాలేదు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.
News January 11, 2026
సంతబొమ్మాళి: వేటకెళ్లి మత్స్యకారుడు మృతి

సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ దిబ్బలమరువాడ గ్రామానికి చెందిన రామారావు(55) ఆదివారం వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. తోటి మత్స్యకారులతో సముద్రంలోకి వేటకెళ్లి ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో బోటు బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడని తోటి మత్స్యకారులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


