News December 21, 2025
కెరమెరి: గుండెపోటుతో బట్టల వ్యాపారి మృతి

బస్సు కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో కూర్చున్న చోటే మృతి చెందిన ఘటన కెరమెరిలో చోటుచేసుకుంది. ASFకు చెందిన అహ్మద్ నవాబ్ బట్టల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం కెరమెరి వారసంతకు బట్టలు అమ్మడానికి వచ్చాడు. వ్యాపారం ముగించుకొని కెరమెరి బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా కూర్చున్నచోటే గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News January 14, 2026
జగిత్యాలలో జర్నలిస్టుల ధర్నా

HYDలో జర్నలిస్ట్‌ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ జగిత్యాలలో TUWJ (IJU) ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్ట్‌లు నిరసనకు దిగారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా NTV INPUT ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్‌ల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
News January 14, 2026
ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్: నథింగ్ CEO

స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ ఏడాది 30% లేదా అంతకంటే ఎక్కువే పెరగొచ్చని నథింగ్ కంపెనీ CEO కార్ల్ పై అంచనా వేశారు. ఒకవేళ ధరలు పెంచకపోతే స్పెసిఫికేషన్స్‌ను తగ్గించాల్సి వస్తుందన్నారు. మెమరీ, డిస్ ప్లే ధరలు కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చాయని, ఇప్పుడు మెమరీ ధరలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. AI వల్ల స్మార్ట్ ఫోన్లలో వాడే మెమరీ చిప్స్‌కు డిమాండ్ ఏర్పడిందని, నథింగ్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్ల ధరలు పెరుగుతాయన్నారు.
News January 14, 2026
అచ్చంపేట కుటుంబం ఆదర్శం

ఉద్యోగ రీత్యా దేశంలో ఎక్కడ ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా సంక్రాంతికి మాత్రం స్వగ్రామం చేరడం ఆ కుటుంబానికి 12 ఏళ్లుగా ఆనవాయితీ. అచ్చంపేటకు చెందిన సదరు కుటుంబ సభ్యులు బుధవారం ఒకచోట చేరి సాంప్రదాయబద్ధంగా వేడుకలు చేసుకున్నారు. చిన్నలు, పెద్దలు అంతా కలిసి వేడుకల్లో పాల్గొంటూ అనురాగాలను పంచుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో పండుగ వేళ ఇలా అందరూ కలవడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు.


