News December 21, 2025

వనపర్తి: బాధితులకు రూ.12.50 లక్షల సైబర్ సొమ్ము అప్పగింత: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో నమోదైన 17 సైబర్ నేర కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.12.50 లక్షల నగదును పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఈ సొమ్మును బాధితులకు అందజేసినట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. సైబర్ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి ఈ మొత్తాన్ని ట్రేస్ చేశారని, న్యాయస్థానం ద్వారా చట్టబద్ధంగా బాధితులకు తిరిగి అప్పగించామని ఆమె పేర్కొన్నారు.

Similar News

News December 25, 2025

ADB: ఆన్లైన్ గేమ్లకు బానిస.. కుమారుడిపై తల్లి ఫిర్యాదు

image

ఆన్లైన్ గేమ్లకు బానిసగా మారిన తన కుమారుడిపై తల్లి ఆదిలాబాద్ టూటౌన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. షేక్ సోహెల్ ఆన్లైన్లో ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తరచూ డబ్బులివ్వాలని తల్లిని, భార్యను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యానగర్‌లో ఉండే సామెరా బీ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News December 25, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 25, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.07 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 25, 2025

క్రిస్మస్, న్యూ ఇయర్.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ప్రధాన వీధుల్లో డ్రంకెన్ డ్రైవ్, ఆకస్మిక తనిఖీలతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.