News December 21, 2025
తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. జిల్లాకు ప్రముఖుల రాక నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. భద్రత ఏర్పాట్లు, విధి నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News December 31, 2025
స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

TG: SC విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టితో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ గడువు ముగియనుంది. దానిని MAR31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉపసంచాలకులు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్, ఆపై చదువులు చదువుతున్న అర్హులైన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి రెన్యువల్/ఫ్రెష్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 31, 2025
విశాఖ: ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే చాలు.. రూ.2,000 ఫైన్!

ఎంవీపీ కాలనీ సెక్టర్-9 చేపల మార్కెట్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సూపర్వైజర్ సత్తిబాబు, సానిటరీ ఇన్స్పెక్టర్ రవి ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న వారికి రూ.2000 జరిమానా విధించారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
News December 31, 2025
ట్రంప్, చైనా కామెంట్స్‌పై మోదీ స్పందించాలి: కాంగ్రెస్

ఇండియా-పాక్ మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం చేశామని <<18718800>>చైనా చేసిన<<>> కామెంట్లపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘తానే యుద్ధాన్ని ఆపినట్టు పలు వేదికల్లో US అధ్యక్షుడు ట్రంప్ చాలాసార్లు చెప్పారు. తామే మధ్యవర్తిత్వం వహించామని ఇప్పుడు చైనా ఫారిన్ మినిస్టర్ చెబుతున్నారు. వాళ్లు చేస్తున్న కామెంట్లు మన దేశ భద్రతను అపహాస్యం చేస్తున్నట్టు ఉన్నాయి’ అని చెప్పారు.


