News December 21, 2025
KCR నోట 15 సార్లు చంద్రబాబు పేరు!

చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ దాదాపు 15 సార్లు ఆయన పేరును ఉచ్చరించారు. ఆనాటి పాలమూరు దత్తత, ఆర్డీఎస్ ధ్వంసం, కృష్ణా, గోదావరి జలాలను దోచుకుంటున్నారంటూ పదేపదే ఎత్తి చూపారు. కేంద్రం మద్దతుతో చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఫైరయ్యారు. పెట్టుబడుల్లోనూ టీడీపీ అధినేతపై జోకులు పేల్చారు. దీంతో మళ్లీ కేసీఆర్ సెంటిమెంటును తెరపైకి తెచ్చారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Similar News
News December 29, 2025
మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

AP: <<18702293>>రాయచోటి<<>>ని జిల్లా కేంద్రంగా తొలగించడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాంప్రసాద్‌రెడ్డితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మీరు పోరాడుతున్నారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేసే వీలులేకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు. రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు CM హామీ ఇచ్చారు.
News December 29, 2025
T20Iల్లో సంచలనం.. 4 ఓవర్లలో 8 వికెట్లు

T20Iలో భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే రికార్డు సృష్టించారు. మయన్మార్‌తో జరిగిన మూడో T20Iలో 22 ఏళ్ల సోనమ్ నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీశారు. టీ20 ఫార్మాట్‌లో ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ 45 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ నుంచి దీపక్ చాహర్ 2019లో ఒక T20 మ్యాచ్‌లో 6 వికెట్లు తీశారు.
News December 29, 2025
టమాటా కాయలపై చిన్న చిన్న రంధ్రాలకు కారణమేంటి?

కొన్ని టమాటా కాయలను పరిశీలిస్తే వాటిపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. దీనికి కారణం సూది పురుగు. ఇది చిన్న గొంగళి పురుగు రూపంలో ఉండి, ఆకులలో సొరంగాలను చేసి, పండ్లలో చిన్న రంధ్రాలు చేసి లోపల తింటుంది. ఈ పురుగుల వల్ల పండ్లు రంగు మారి, పాడైపోతాయి. సూది పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ml లేదా ప్లూబెండమైడ్ 0.2ml కలిపి పిచికారీ చేయాలి.


