News December 21, 2025

MHBD: వీడని ఉత్కంఠ.. సర్పంచ్ ఎవరు..?

image

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని <<18536941>>దామరవంచ గ్రామ పంచాయతీలో<<>> విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులుగా సుజాత, స్వాతి పోటీపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో తొలుత స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేయగా, రీకౌంటింగ్‌లో సుజాత ఒక్క ఓటుతో గెలిచినట్లు మరో ప్రకటన చేశారు. దీంతో సర్పంచ్ నేనంటే నేనని సోమవారం ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి సోషల్ మీడియాలో ఆహ్వానం పలుకుతున్నారు.

Similar News

News January 15, 2026

జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

image

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్‌లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్‌ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్‌తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్‌, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్‌లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది.

News January 15, 2026

‘జన నాయగన్’ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

image

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సూచించింది. గతంలో U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అయితే, CBFC సర్టిఫికెట్ క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతలు SCని ఆశ్రయించారు.

News January 15, 2026

బిక్కనూర్: ‘వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది జీవన విధానం’

image

వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది మన జీవన విధానం అని చాటిచెప్పింది కాచాపూర్ గ్రామానికి చెందిన చిన్నారి మహాన్వి. సంక్రాంతి పురస్కరించుకుని గురువారం ఆమె వేసిన ముగ్గు గ్రామస్తులను ఆలోచింపజేసింది. రైతు జీవన శైలిని ప్రతిబింబిస్తూ రంగురంగులతో తీర్చిదిద్దిన ఈ రంగవల్లిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే వ్యవసాయంపై మమకారాన్ని చాటిన మహాన్విని పలువురు అభినందించారు.