News April 21, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేరుగా PhD చేయొచ్చు!

image

UGC NET జూన్ సెషన్ పరీక్షలో కొత్త విధానం అమల్లోకి రానుంది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 75% మార్కులు/సమానమైన గ్రేడ్‌లు సాధించిన వారు నేరుగా UGC NET రాయవచ్చని సంస్థ ఛైర్మన్ జగదీశ్ వెల్లడించారు. ఆ అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉన్నా లేకపోయినా PhD అభ్యసించొచ్చని తెలిపారు. కాగా ఇప్పటివరకు మాస్టర్స్ డిగ్రీలో 55% మార్కులు వచ్చిన వారికి మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశముండేది.

Similar News

News March 20, 2026

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 901 పాయింట్లు పెరిగి 75,109 వద్ద.. నిఫ్టీ 286 పాయింట్లు పుంజుకొని 23,288 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి భారీ నష్టాలతో కీలక రంగాల్లో షేర్లు ఆకర్షణీయ ధరలకే లభిస్తుండడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నారు. మరోవైపు నిన్న భారీగా పెరిగిన చమురు ధరలు కాస్త దిగిరావడం కూడా కలిసొచ్చింది. సెన్సెక్స్-30 సూచీలో HDFC షేరు మాత్రమే నష్టాల్లో ఉంది.

News March 20, 2026

పూజ గదిలో బొమ్మపై విమర్శలు.. మంత్రి లోకేశ్ క్లారిటీ

image

AP: ఉగాది సందర్భంగా నిన్న కుమారుడు దేవాన్ష్‌తో కలిసి పూజలో పాల్గొన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. అయితే పూజ గదిలో ఓ మూలన కనిపించిన చిన్నబొమ్మపై పలువురు విమర్శలు చేయగా మంత్రి కౌంటర్ ఇచ్చారు. నాలుగేళ్ల వయసులో దేవాన్ష్‌ చేసిన శివుడు, శివలింగం ఆకృతులను గుర్తుగా పూజగదిలో ఉంచామన్నారు. దేవుడిపై విశ్వాసాన్ని కొందరే అర్థం చేసుకుంటారని, అలాగే ఇలాంటి భక్తిని వివరించాల్సిన అవసరం లేదన్నారు.

News March 20, 2026

IPL: ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్.. నెట్టింట ట్రోల్స్

image

IPL కీలక ప్లేయర్లు గాయాలబారిన పడి లీగ్‌కు దూరం అవుతున్నారు. దీంతో IPLను ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఎల్లిస్(CSK), సామ్ కరన్(RR), హర్షిత్(KKR), మిల్నే(RR), జాక్ ఎడ్వర్డ్స్(SRH), హసరంగా(LSG) ఇప్పటికే లీగ్ నుంచి వైదొలిగారు. ఇక హేజిల్ వుడ్(RCB), కమిన్స్(SRH) గాయాలతో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఈనెల 28న లీగ్ ప్రారంభమయ్యేలోపు ఇంకెంత మంది ఇలా గాయాలబారిన పడతారో?