News December 22, 2025

NZB: ప్రజలు భయాందోళనకు గురికావద్దు:కలెక్టర్

image

వరదలు, ఇతర విపత్తులు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా రేపు (సోమవారం) చేపడుతున్న మాక్ ఎక్సర్ సైజ్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బోధన్ హంగర్గ గ్రామంతో పాటు NZBప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఖిల్లా రఘునాథ్ చెరువు వద్ద మాక్ ఎక్సర్ సైజ్ ఉంటుందన్నారు.

Similar News

News January 3, 2026

NZB: విద్యతో మహిళలకు విముక్తి దీపం: TPCC అధ్యక్షుడు

image

విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి నివాళి అర్పించారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యమన్నారు. ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.

News January 2, 2026

నిజామాబాద్: దొంగల కోసం గాలిస్తున్నాం: SI

image

నిజామాబాద్ 3 టౌన్ పరిధిలో రైతు బజార్ వద్ద గణేశ్ జువెలరీ షాప్‌లో నిన్న రాత్రి దుండగులు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని త్రీ టౌన్ SI హరిబాబు తెలిపారు. బ్లూకోట్ కానిస్టేబుల్ షట్టర్ ఓపెన్ ఉండటం గమనించి అటువైపు వెళ్లగా ముగ్గురు దుండగులు పారిపోయరన్నారు. షాపు యజమాని వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News January 2, 2026

NZB: ప్రైవేట్ హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్

image

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. MHలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌కు చెందిన ఓంకార్(24) ఖలీల్‌వాడీలోని సాయి అశ్విని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.