News December 22, 2025
NZB: ప్రజలు భయాందోళనకు గురికావద్దు:కలెక్టర్

వరదలు, ఇతర విపత్తులు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా రేపు (సోమవారం) చేపడుతున్న మాక్ ఎక్సర్ సైజ్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బోధన్ హంగర్గ గ్రామంతో పాటు NZBప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఖిల్లా రఘునాథ్ చెరువు వద్ద మాక్ ఎక్సర్ సైజ్ ఉంటుందన్నారు.
Similar News
News December 30, 2025
NZB: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు మరో 2 నెలలు పొడిగింపు

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ I&PR ప్రత్యేక కమిషనర్ సీహెచ్. ప్రియాంక మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31తో ముగియనున్న కార్డుల గడువును జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. త్వరలో కొత్త అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News December 29, 2025
నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కలు ఇవే!

నిజామాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నిజామాబాద్‌లో 60 వార్డులు ఉండగా 3,11,152 జనాభా ఉంది. అందులో SCలు 23,788, STలు 3,425 ఉన్నారు. బోధన్‌లో 38 వార్డుల్లో 82,744 జనాభా ఉండగా SCలు 6,704, STలు 890 ఉన్నారు. ఆర్మూర్‌లో 36 వార్డుల్లో 67,252 మంది ఉండగా ఎస్సీలు 5,625, ఎస్టీలు 886 నమోదయ్యారు. భీమ్‌గల్‌లో 12 వార్డుల్లో 15,446 మంది ఉండగా ఎస్సీలు 1,957, ఎస్టీలు 696 ఉన్నారు.
News December 29, 2025
NZB: 21 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 21 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.


