News April 22, 2024

కొండగట్టులో నేటి నుంచి హనుమాన్ జయంతి వేడుకలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లను ఆదివారం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీలించారు. తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు, కళ్యాణకట్ట, ఆలయ పరిసరాలను తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

Similar News

News January 8, 2026

KNR: తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలో హరిప్రసాద్‌

image

తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీల అధ్యయన కమిటీ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ నియమితులయ్యారు. నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ క్రమంలో వివిధ పార్టీల పనితీరును విశ్లేషించేందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కవితకు అత్యంత విధేయుడైన హరిప్రసాద్‌కు రాష్ట్ర స్థాయి కమిటీలో చోటు దక్కడంపై జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

News January 8, 2026

కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.

News January 8, 2026

కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

image

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.