News December 22, 2025

సిద్దరాంపురం వాసికి IESలో ఆల్ ఇండియా 22వ ర్యాంక్

image

ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన తాల్లూరు హరికృష్ణ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా లెవెల్ 22వ ర్యాంక్ సాధించారు. ఆత్మకూరు మాజీ జడ్పీటీసీ హనుమంతప్ప చౌదరి మనవడైన హరికృష్ణ అత్యుత్తమ ర్యాంక్ సాధించడంపై ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. 2022 నుంచి RWS శాఖలో AEEగా కుప్పంలో విధులు నిర్వహిస్తూ, IES కోసం కష్టపడి తాజాగా 22వ ర్యాంక్ సాధించారు.

Similar News

News January 6, 2026

ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో శ్రామికుల హాజరు పెంచాలని, ఫారం పాండ్లు, కంపోస్ట్ పిట్‌లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గోకులం షెడ్లను జనవరి 15 నాటికి ప్రారంభించి, మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు.

News January 5, 2026

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వీడాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సీఎంఓ, ఎమ్మెల్యే, ఎంపీ పెండింగ్ ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు.