News April 22, 2024

జిల్లాలోని సమస్య ఆత్మక పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ బస

image

సార్వత్రిక ఎన్నికల 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ మాచర్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, చెక్ పోస్టులను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల విధులను అప్రమత్తత నిర్వహించాలన్నారు. మద్యం, నగదు ఇతర వస్తువులు అక్రమ రవాణాను నివారించాలని, సిబ్బందికి సలహాలు అందజేశారు. తనిఖీ అనంతరం మందడం జిల్లా పరిషత్ పాఠశాలలో రాత్రి బస చేశారు.

Similar News

News March 21, 2026

GNT: PACS ఉద్యోగులకు డిగ్రీ నిబంధనపై అసంతృప్తి

image

PACS సిబ్బందికి ప్రమోషన్ల కోసం డిగ్రీ అర్హత తప్పనిసరి చేయడం వివాదంగా మారింది. ఉమ్మడి GNT జిల్లాలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగులు దీనిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 20ఏళ్లకు పైగా సేవ చేస్తున్న వారిని ఇప్పుడు చదువు పూర్తి చేయాలని కోరడం కష్టమని అంటున్నారు. 2020లో రూపొందించిన HR పాలసీ అమలు కాకపోయినా కొత్త నిబంధనలు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యోగులు మరికొంత గడువు ఇవ్వాలంటున్నారు.

News March 21, 2026

సామాన్యుడిలా తిరుమల దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు

image

సీఎం హోదాలో ఉన్న ప్రొటోకాల్ పక్కనపెట్టి సామాన్యుడిలా క్యూ కాంప్లెక్స్ వెళ్లి చంద్రబాబు కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇవాళ దర్శనం చేసుకుంది. శనివారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ మార్గంలో వెళ్తూ టీటీడీ ఏర్పాట్లు, భ‌క్తుల ఇబ్బందులు చంద్రబాబు పరిశీలించి స్వయంగా తెలుసుకున్నారు. లోపాలను వెంటనే సరిదిద్దాలని టీటీడీ అధికారులకు సూచించారు.

News March 21, 2026

గుంటూరు: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

image

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ‘మిషన్ వాత్సల్య’ కింద కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కౌన్సిలర్, మేనేజర్, స్టోర్ కీపర్, హెల్పర్, పీటీ, యోగా టీచర్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు మార్చి 23 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు guntur.ap.gov.in వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు.