News April 22, 2024
వాహన తనిఖీలకు సహకరించాలి: సిద్దిపేట CP

వాహనాల తనిఖీ నిర్వహించేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. వాహనదారులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా డబ్బులు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్, లిక్కర్ అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు వరకు వాహన తనిఖీల్లో రూ. 66,10,840 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు.
Similar News
News March 11, 2026
మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ కలెక్టరేట్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించి స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
News March 11, 2026
MDK: నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ హత్య..?

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) సోమవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెలిమకుంట వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముఖంపై కర్రతో దాడి చేసిన గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
News March 11, 2026
ఫైల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల సెక్షన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత, పరిశుభ్రత పనులను తనిఖీ చేసి నిరుపయోగ వస్తువులు, పరికరాలను తొలగించాలని ఆదేశించారు.


