News April 22, 2024
ఒంగోలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పార్లమెంటు స్థానాలను ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డిని నియమించారు. ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News March 16, 2026
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన SP

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఆయన త్యాగం ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు.
News March 16, 2026
మార్కాపురం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే: జేసీ

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసి అధికారులకు సమర్పించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్జీలపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు.