News December 22, 2025

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా గౌరు చరిత రెడ్డి

image

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నియమితులైనట్లు ఆపార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పాణ్యం ఎమ్మెల్యేగా పనిచేస్తూ, అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు. వారికి నంద్యాల, పాణ్యం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

Similar News

News January 14, 2026

వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

image

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.

News January 14, 2026

కొందరి పౌరసత్వ నిర్ధారణ కోసం ఎన్నికల ప్రక్రియను ఆపలేము: ECI

image

పౌరసత్వం తేలేవరకు ఓటు హక్కును తొలగించవచ్చా? అని ECని SC ప్రశ్నించింది. SIR వ్యాజ్యంపై CJI సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి విచారించారు. ‘పౌరసత్వంపై కేంద్రానికి నివేదించి EC నిర్ణయం తీసుకుంటుంది. అయితే కేంద్రం తేల్చే వరకు వేచి ఉండకుండా EC నిర్ణయం తీసుకోవచ్చు. ఓటరు పేరు తొలగించొచ్చు. దానిపై సదరు వ్యక్తి అప్పీలు చేయొచ్చు’ అని EC న్యాయవాది ద్వివేది కోర్టుకు తెలిపారు. దీనికోసం ఎన్నిక ప్రక్రియ ఆపలేమన్నారు.

News January 14, 2026

హనుమకొండ ఖాళీ.. నిర్మానుష్యంగా రోడ్లు!

image

సంక్రాంతి సందర్భంగా హనుమకొండ నగరం ఖాళీ అయింది. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పట్టణ ప్రజలంతా పండగ కోసం పల్లెబాట పట్టారు. నిత్యం రద్దీగా ఉండే హన్మకొండ చౌరస్తా, బస్టాండ్ ప్రాంతం, పెట్రోల్ పంప్ ఏరియా ఖాళీగా కనిపించింది. పట్టణ ప్రజలంతా గ్రామాల్లోకి వెళ్లడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.