News December 22, 2025

కడప కలెక్టరేట్ వద్ద సర్పంచుల నిరసన: శివచంద్రారెడ్డి

image

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 15, 2026

కడప బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం

image

కడపలో ఓ వ్యక్తి చేసిన తప్పిదంతో ప్రజలు హడలిపోయారు. పులివెందుల బస్సుకు తాళం అలాగే వదిలేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఈక్రమంలో ఓ యువకుడు బస్సు స్టార్ట్ చేశాడు. అప్పటికే అందులో ఉన్న ప్రయాణికులు అతడి తీరు చూసి భయంతో కేకలు వేశారు. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి మతిస్థిమితం సరిగా లేదని సమాచారం. పొరపాటున అతను డ్రైవ్ చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది.

News January 15, 2026

కడప: వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు

image

నిరంతరం విధి నిర్వహణలో భాగంగా డ్రెస్‌లో కనిపించే పోలీస్ అధికారులు భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో కనువిందు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి భోగి పండుగను స్వాగతించారు. జిల్లా ఎస్పీతో సహా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా కనిపించారు.