News April 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 20, 2024

ఈనెల 24న చెన్నైలో ‘పుష్ప-2’ ఈవెంట్!

image

‘పుష్ప-2’ సినిమా టీమ్ ఈనెల 24న చెన్నైలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 27న కొచ్చిలో ప్రమోషనల్ ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నాయి. బెంగళూరు, ముంబై, కోల్ కతా, HYDలోనూ ఈవెంట్స్ జరగనున్నాయి. ఇటీవల పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి 2 లక్షలకు పైగా జనం వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.

News November 20, 2024

డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

TG: ఉస్మానియా వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 23వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెలలో పరీక్షలు జరగనుండగా, ఎగ్జామ్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు వర్సిటీ <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలని సూచించారు.

News November 20, 2024

గత పాలకులు తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టలేదు: పవన్

image

AP: ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం గ్రామానికి రూ.4లక్షల ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అంది ఉండేదన్నారు. వారి నిర్లక్ష్యంతో రంగు మారిన నీరు పైపుల ద్వారా వెళ్లిందని, గుడివాడలో ఈ సమస్య తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించామన్నారు. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత టైంలోగా మార్చాలని ఆదేశించారు.