News December 22, 2025

నేడు ప్రజా అర్జీలు స్వీకరించనున్న బాపట్ల కలెక్టర్

image

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే PGRSకు జిల్లాస్థాయి అధికారులు అందరూ హాజరు కావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు PGRS అర్జీలపై జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. ప్రతి డివిజన్, మండల రెవెన్యూ కార్యాలయాలలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 27, 2025

వింటర్‌లో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది!

image

చలికాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు, ఇమ్యూనిటీ పెరిగేందుకు వైద్యులు కొన్ని సలహాలిస్తున్నారు. ‘లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగండి. ఉదయం కాసేపు ఎండలో ఉండండి. వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలి. స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రొటీన్+హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా బ్రేక్‌ఫాస్ట్ ప్లాన్ చేసుకోండి. కోల్డ్ వాటర్, ఖాళీ కడుపుతో కాఫీ తాగడం, లేవగానే హడావుడిగా పనులు చేయడం మానుకోండి’ అని చెబుతున్నారు.

News December 27, 2025

శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్లలో 2,398 మంది మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్ల నుంచి రోడ్డు ప్రమాదాలలో 2,398 మంది మృతి చెందారు. 2023 – 810, 2024- 889, 2025లో ఇప్పటి వరకు 699 మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం 2026 మొదటి నెలను రోడ్డు భద్రత మాసంగా ప్రకటించింది. ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకపోవడంగా గుర్తించారు. వీటిని అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

News December 27, 2025

కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఈ పనులు చేయాలట!

image

2026లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, ఇంటిముందు ముగ్గులు వేసి తులసి కోటను పూజించాలి. తులసి మొక్కకు ఎరుపు దారం కట్టి విష్ణు మంత్రాలు జపించాలి. ఇది ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి, ఆవుకు గ్రాసం తినిపించాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది’ అంటున్నారు.