News December 22, 2025
చిన్న శంకరంపేట: తాత హయాంలో నిర్మాణం.. మనుమడి హయాంలో హంగులు

చిన్నశంకరంపేట జీపీ సర్వంగ సుందరంగా ముస్తాబయింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రశేఖర్ తాత కంజర్ల శంకరప్ప రెండవసారి సర్పంచ్ గా పదవీలో కొనసాగుతున్నప్పుడు 01 నవంబర్ 1977 నాటికి గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టారు. ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కోదాటి రాజమల్లు ప్రారంభోత్సవం చేశారు. తాత నిర్మాణం చేపట్టిన జీపీలో మనుమడు పదవి చేపట్టడం కొసమెరుపు.
Similar News
News December 24, 2025
MDK: క్రిస్మస్‌ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి: కలెక్టర్

యేసుక్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, క్షమ, త్యాగం, శాంతియుత సహజీవనం వంటి విలువలను యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు. ఈ సందేశాన్ని ఆచరణలో పెట్టాలని కోరుతూ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
News December 24, 2025
MDK: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, అహింసా శాంతి మార్గాన్ని యేసు క్రీస్తు మానవ సమాజానికి చూపించారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో క్రిస్టియన్ మైనారిటీలకు దేశానికే ఆదర్శంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు.
News December 24, 2025
మెదక్: చర్చిల ఫీస్ట్ వేడుకలకు నిధులు మంజూరు

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని చర్చిల్లో ఫీస్ట్ సెలబ్రేషన్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.34 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షలు కేటాయించగా, రెండు నియోజకవర్గాల్లోని 100 చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున రూ.30 లక్షలు మంజూరు చేసిందన్నారు.


