News December 22, 2025
16 సోమవారాల వ్రత ఉద్యాపన నియమాలు

వ్రతం పూర్తయ్యాక 17వ సోమవారం నాడు ఉద్యాపన చేయాలి. ఉదయాన్నే శివపార్వతులను పూజించాలి. గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో ‘చూర్మ’ ప్రసాదాన్ని చేయాలి. దాన్ని 3 భాగాలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. మిగిలిన రెండు భాగాల్లో ఒకటి దానం చేసి, మిగితాది మీరు స్వీకరించాలి. 16 మందికి శక్తి మేర భోజనం, తాంబూలం ఇవ్వడం మంచిది. శాస్త్రోక్తంగా చేసే ఉద్యాపనతో వ్రత ఫలం సంపూర్ణంగా దక్కి, కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
Similar News
News January 3, 2026
మంచిర్యాల: ముడి సరుకుల కొరకు కొటేషన్ల ఆహ్వానం

మంచిర్యాల జిల్లాలోని 4 ప్రభుత్వ ఐటీఐలలో ముడి సరుకులు కొనుగోలు కొరకు కొటేషన్స్ ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ మంచిర్యాల, ప్రభుత్వ ఐటీఐ శ్రీరాంపూర్, ప్రభుత్వ ఐటీఐ జన్నారం, ప్రభుత్వ ఐటీఐ మందమర్రిలలో సంప్రదించాలన్నారు. ఆసక్తిగల సరఫరాదారులు తమ కొటేషన్స్‌కు సంబంధించిన ముడి సరుకుల వివరాలను సీల్డ్ కవర్‌లో జనవరి 8 సాయంత్రం 5గంటల లోపు అందజేయాలని సూచించారు.

ఖేలో ఇండియా సెంటర్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో ఖేలో ఇండియా సెంటర్స్ పథకం కింద జిల్లా స్థాయిలో కొత్త కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహ రెడ్డి తెలిపారు. సైక్లింగ్, తైక్వాండో, షూటింగ్, జిమ్నాస్టిక్స్, కరాటే తదితర 15 క్రీడా విభాగాల్లో కనీసం 3 విభాగాలను ఎంచుకోవాలన్నారు అర్హులైన మాజీ క్రీడాకారులు ఈ నెల 3 నుంచి 8 లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 87126 22574ను సంప్రదించాలన్నారు.