News December 22, 2025

అన్నమయ్య: రేపు బంద్

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని ఆ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. రేపు రాజంపేట బంద్‌కు JAC నేతలు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజంపేటకు ద్రోహం చేసిన YCP ఎమ్మెల్యే, MPలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. YCP అన్యాయం చేసింది మీరైనా న్యాయం చేయండి అంటూ CM చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 27, 2025

NLG: యువ వికాసం కోసం ఇంకా ఎదురుచూపులే!

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న సర్కారు లక్ష్యం దరఖాస్తులకే పరిమితమైంది. ఉమ్మడి జిల్లాలో రాజీవ్ యువ వికాసం స్కీంకు వివిధ వర్గాల నుంచి 1,78,060 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క నల్గొండ జిల్లా నుంచి 79, 052 మంది యువకులు దరఖాస్తు చేసుకున్నారు. 8 నెలలు గడుస్తున్నా నిధులు మంజూరు కాకపోవడంతో యువత నిరుత్సాహానికి గురవుతోంది. దరఖాస్తుదారులకు ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి.

News December 27, 2025

ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇవి కూడా కారణం కావొచ్చు

image

ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నో అంశాలు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం, అధిక ఒత్తిడికి గురవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక/ తక్కువ బరువు, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందంటున్నారు. అందుకే ముందుగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.

News December 27, 2025

అంటే.. ఏంటి?: Backyard

image

ఇంటి వెనక పెరటిని Backyard అంటారు. ఇది Back, Yard పదాలను కలిపితే వచ్చింది. Back అనే ఇంగ్లిష్ పదానికి వెనక అని అర్థం. జర్మన్‌లో Gard అంటే తోట. ఆ పదాన్ని ఇంగ్లిష్‌లోని స్థలం కొలిచే ప్రమాణమైన Yardతో పోలుస్తూ BackYardగా పిలుస్తున్నారు.
రోజూ 12pmకు ఓ ఆంగ్ల పదం అర్థం, వివరణ, పుట్టుక
<<-se>>#AnteEnti<<>>