News December 22, 2025

కంగ్టి: భర్త ఆటో డ్రైవర్.. భార్య సర్పంచ్

image

కంగ్టి మండలం ముర్కుంజాల్ సర్పంచిగా సారంగి అనూష లాల్ కుమార్ ఎన్నికయ్యారు. ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో, బరిలోకి దిగిన ఆమె ఘన విజయం సాధించారు. అనూష భర్త లాల్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి, ప్రజల సేవకు అంకితమవుతానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Similar News

News December 26, 2025

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం HYD నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా దివంగత మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం డోర్నకల్‌ మండలంలో పర్యటించి, నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

News December 26, 2025

ప్రత్యేక PGRSలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్టీలు, దివ్యాంగుల ప్రత్యేక PGRS కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు, దివ్యాంగుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటికి వెంటనే కలెక్టర్ పరిష్కార మార్గం చూపినట్లు వివరించారు.

News December 26, 2025

పింఛన్ లబ్ధిదారులకు కలెక్టర్ గుడ్ న్యూస్!

image

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఒకరోజు ముందుగానే నగదు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశించిన సమయానికి పింఛన్ అందజేయాలని స్పష్టం చేశారు.