News April 22, 2024
ప.గో.: కూటమి అభ్యర్థులను గెలిపించాలి: RRR

ప.గో. జిల్లా కాళ్ళ మండలం జక్కరం గ్రామంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలిపించాలని సూచించారు.
Similar News
News March 22, 2026
పశ్చిమ గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్

కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.30 కోట్లతో “మీ ఇంటికి – మీ డాక్టర్” సేవలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నాడు నరసాపురం మండలంలోని 18 గ్రామాల్లో ఈ మొబైల్ మెడికల్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాన్‌లో డాక్టర్లు, నర్సుల బృందం నేరుగా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. రెడ్ క్రాస్ సేవల విస్తరణలో భాగంగా మన జిల్లా ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది.
News March 22, 2026
ప.గో: తినీ తినక కిస్తీలు కడుతున్నాం.. మా ఇళ్లు మాకు ఇవ్వండి!

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News March 21, 2026
తరిగొప్పుల రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడి మృతి

కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు(సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్‌పీ సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విన్నవించారు.


