News December 22, 2025
సౌదీలో లిక్కర్ కిక్కు.. రహస్యంగా..

ఇస్లాం దేశం అయిన సౌదీలో రూల్స్ మారుతున్నాయి. రియాద్‌లోని ‘డిప్లొమాటిక్ క్వార్టర్’లో ఉన్న ఓ దుకాణంలో అత్యంత రహస్యంగా నాన్-ముస్లిం విదేశీయులకు మద్యం విక్రయిస్తున్నారు. కాగా 1950లో సౌదీలో మద్యాన్ని బ్యాన్ చేశారు. దీంతో కొందరు చుట్టుపక్కల దేశాలకు వెళ్లి లిక్కర్ ఎంజాయ్ చేసేవారు. క్రూడ్ ఆయిల్‌కు ప్రత్యామ్నాయంగా పర్యాటక ఆదాయం కోసం సౌదీ యువరాజు కఠినమైన నిబంధనలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.
Similar News
News January 10, 2026
తమీమ్-బీసీబీ మధ్య మాటల యుద్ధం

T20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా న్యూట్రల్ వేదికల్లో పెట్టాలంటూ <<18761652>>BCB<<>> కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అంశం బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘మనకు ఎక్కువ ఆదాయం ICC నుంచే వస్తోంది కాబట్టి భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ సూచించారు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లాం తమీమ్ “ఇండియన్ ఏజెంట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
News January 10, 2026
స్లీపర్ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

దేశంలో స్లీపర్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News January 10, 2026
జనవరి 10: చరిత్రలో ఈరోజు

* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు. * 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్ * 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు * 1974: బాలీవుడ్ నటుడు హ్రితిక్ రోషన్ జననం (ఫొటోలో)


