News December 22, 2025
నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం రద్దు

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీఎస్పీడీసీఎల్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News January 5, 2026
నల్లమల సాగర్‌పై SCలో విచారణ

పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్ట్‌పై TG ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై SC CJI ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘AP వరద జలాలే వాడుకుంటామని చెబుతోంది. కేటాయింపులకు విరుద్ధంగా నీళ్లను వాడుకోవడం అసాధ్యం. దీనికి అనేక విషయాలు ముడిపడి ఉన్నాయి. తెలంగాణ అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి’ అని సింఘ్వీ పేర్కొన్నారు.
News January 5, 2026
రాజీనామాపై మరోసారి ఆలోచించండి.. కవితకు ఛైర్మన్ సూచన

TG: MLC పదవికి రాజీనామాపై మరోసారి ఆలోచించుకోవాలని కవితకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ సూచించారు. ‘కవిత ఆవేదనను అర్థం చేసుకున్నాం. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది. భావోద్వేగంలో నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు’ అని పేర్కొన్నారు. అయితే తాను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని, రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరారు. వ్యక్తిలా వెళ్లి శక్తిలా తిరిగొస్తానన్నారు.
News January 5, 2026
నిర్మల్: మున్సిపల్ రేసులో పెరగనున్న ఎన్నికల వేడి

జిల్లాలోని 3 మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. తాజా గణాంకాల ప్రకారం NRMLలో 98,295, భైంసా 51,118, ఖానాపూర్‌లో 17,693 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం పెరగడం, పాత వార్డుల్లో కుటుంబాల విస్తరణతో తుది జాబితా నాటికి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓట్ల సంఖ్య పెరిగితే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై అదనపు భారం పడనుంది.


