News April 22, 2024
CAA, కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేస్తాం: చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే NDA తెచ్చిన కొన్ని చట్టాలను సవరించడం లేదా రద్దు చేస్తామని ప్రకటించారు. వాటిలో CAA, మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ఉంటాయని తెలిపారు. ‘బెయిల్ అనేది రూల్.. జైల్ అనేది మినహాయింపు అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. దేశంలో 65% మంది ఖైదీలు విచారణలో ఉన్నారు. వారు దోషులు కాకపోయినా జైలులో ఎందుకు ఉండాలి?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 20, 2024
ప్రజలకు TGPSC క్షమాపణలు చెప్పాలి: KTR
TG: గ్రూప్-3 ప్రశ్న పత్రంలో తక్కువ కులం, ఉన్నత కులం అనే పదాలు వాడారని డా.RS. ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌పై KTR స్పందించారు. ‘TGPSC ఈ రకమైన కులతత్వ ఎజెండాను ప్రోత్సహించడం సిగ్గుచేటు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని అన్నారు. ‘తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇక సామాజిక న్యాయం ఎలా వస్తుంది రేవంత్ గారూ?’ అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
News November 20, 2024
ఖాళీ కడుపున వర్కవుట్స్‌తో ఉపయోగాలివే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయడం వల్ల ఉపయోగాలుంటాయా? ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే గ్లైకోజెన్ స్థాయులు తగ్గిపోతాయి. పోగైన కొవ్వుల్ని శరీరం శక్తికోసం వాడుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది. గ్లూకోజ్‌ని మరింత వేగంగా పీల్చుకుంటుంది. దీంతో టైప్ 2 మధుమేహం తగ్గుతుంది. హార్మోన్లు సమతుల్యమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఏకాగ్రత పెరిగి, చలాకీగా ఉంటారు.
News November 20, 2024
ఈనెల 24న చెన్నైలో ‘పుష్ప-2’ ఈవెంట్!
‘పుష్ప-2’ సినిమా టీమ్ ఈనెల 24న చెన్నైలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 27న కొచ్చిలో ప్రమోషనల్ ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నాయి. బెంగళూరు, ముంబై, కోల్ కతా, HYDలోనూ ఈవెంట్స్ జరగనున్నాయి. ఇటీవల పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి 2 లక్షలకు పైగా జనం వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.