News April 22, 2024
దావూద్ పార్టీల్లో డాన్స్ వార్తలపై ట్వింకిల్ ఖన్నా ఏమన్నారంటే?

దావూద్ ఇబ్రహీం పార్టీల్లో బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా డాన్సులు చేశారని 10-15 ఏళ్ల కిందట వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె తాజాగా స్పందించారు. ‘నిరసనల సమయంలో రెజ్లర్లు నవ్వుతున్నట్లు మార్ఫింగ్ ఫొటోలు వచ్చాయి. కరోనా గురించి ఎన్నో అవాస్తవ కథనాలు వచ్చాయి. అలాగే నేను దావూద్ పార్టీల్లో డాన్స్ చేశానన్నారు. కానీ నా డాన్స్ స్కిల్స్ ఘోరం. దావూద్ బాగా డాన్స్ చేసే వాళ్లను సెలక్ట్ చేసుకుంటాడు’ అని చెప్పారు.
Similar News
News March 22, 2026
నాగాయలంక మత్స్యకార బిడ్డ.. అంతర్జాతీయ ఖ్యాతి!

కృష్ణా (D) నాగాయలంకకు చెందిన మత్స్యకార బిడ్డ నాగిడి గాయత్రి క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ను ఆమె పూర్తి చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కోచ్‌ల చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. గాయత్రి ప్రతిభను గుర్తించిన గ్రామస్థులు, కోచ్‌లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
News March 22, 2026
వ్యర్థాలతో గ్యాస్ ఉత్పత్తి.. 5 ప్లాంట్ల ఏర్పాటు

AP: పట్టణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలను కంప్రెస్డ్ బయో గ్యాస్(CBG)గా మార్చే ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్తగా వీటిని ఏర్పాటు చేయనుండగా, విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.59.85కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతి CBG ప్లాంట్ సామర్థ్యం రోజుకు 25 టన్నులు ఉంటుంది.
News March 22, 2026
కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

కేరళంలోని కోళికోడ్ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.


