News December 22, 2025

జగిత్యాల: కొత్త సర్పంచులకు సవాళ్లెన్నో..!

image

నేడు కొలువుదీరనున్న గ్రామపంచాయతీ పాలక వర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గతేడాది FEBలోనే వీరి పదవి గడువు ముగియడంతో BC రిజర్వేషన్లు, ఇతర కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈనెల 11 నుంచి 17వరకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇక అరకొర నిధులతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు కొత్త సర్పంచులకు సవాల్‌గా మారనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 385 గ్రామపంచాయతీలు, 3536 వార్డు స్థానాల్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News January 16, 2026

NGKL: 1,148 టన్నుల యూరియా నిల్వలు- కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో శుక్రవారం నాటికి 1,148 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఈ నెలలో 5,689 టన్నుల యూరియా జిల్లాకు రానుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 19,280 టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు 65 శాతం మంది రైతులు వారి పంటలకు అవసరమైన యూరియాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

News January 16, 2026

2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

image

TG: తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్ పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నాకిచ్చిన బాధ్యతతో పని చేయాలి అనుకుంటున్నా. ఇతరుల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేయను. రాబోయే ఎన్నికలతో పాటు 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం’ అని నిర్మల్ సభలో స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు.

News January 16, 2026

టోల్ ప్లాజాల దగ్గర ఇక నో క్యాష్ పేమెంట్స్?

image

వంద శాతం డిజిటల్ టోలింగ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్స్‌ను పూర్తిగా నిలిపేసి కేవలం FASTag లేదా UPI ద్వారానే వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిల్లర సమస్యలు, ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలకడమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకురానున్నారు. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.