News December 22, 2025

నెల్లూరు: ఇద్దరు బీటెక్ యువకుల మృతి

image

నెల్లూరు రూరల్ కొత్త LNTకి చెందిన యుగంధర్ రెడ్డి(21) గూడూరు నారాయణ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీనివాససత్రం బీచ్‌కు వెళ్లాడు. అలల తాకిడికి యుగంధర్ రెడ్డి కొట్టుకెళ్లి చనిపోయాడు. అలాగే నెల్లూరు సిటీకి చెందిన హర్షసాయి(19) ఒంగోలులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కొత్తపట్నం బీచ్‌కు వెళ్లాడు. అలల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి హర్షసాయి వెళ్లి చనిపోయాడు.

Similar News

News December 26, 2025

నెల్లూరు: 104 వాహనాల్లో ఉద్యోగావకాశాలు

image

జిల్లాలోని 104 వాహనాల్లో డ్రైవర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డీఈవోలకు డిగ్రీ, కంప్యూటర్ కోర్సు, డ్రైవర్లకు టెన్త్ పాస్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు bhspl.in/careers ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని TB జిల్లా కార్యాలయంలో ఈనెల 27, 28 తేదీలలో సంప్రదించాలని కోరారు.

News December 26, 2025

వెంకటగిరిలో భారీ దొంగతనం

image

వెంకటగిరిలో భారీ దొంగతనం వెలుగు చూసింది. తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణయ్య టీచర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఆయన బుధవారం ఊరికి వెళ్లారు. ఆయన ఇంటి తాళం తెరిచి ఉండటాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించి కృష్ణయ్యకు సమాచారం ఇచ్చారు. 60 సవర్ల బంగారం, అర కేజీ వెండి ఆభరణాలు, రూ.2లక్షలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

News December 26, 2025

పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడిన పోలీసులు

image

పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కోవూరు పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఓ వృద్ధుడు గేదెలను తోలుకుంటూ జమ్మిపాళెం వద్ద పెన్నా నదిలోకి వెళ్లిన సమయంలో పెన్నా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కావడంతో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా ప్రాంతానికి చేరుకొని స్థానిక ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి వృద్ధుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.