News December 22, 2025

ఖమ్మం @ 8,095

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 8,095 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ అదాలత్‌లో అత్యధికంగా 6,394 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 999 క్రిమినల్, 370 చెక్ బౌన్స్, 144 బ్యాంక్, 37 సైబర్, కుటుంబ తగాదాలు 20, ఈపీలు 09 పరిష్కారమైయ్యాయి. రాజీ మార్గమే రాజమార్గమని, దీనివల్ల కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని న్యాయాధికారులు పేర్కొన్నారు.

Similar News

News February 18, 2026

ఖమ్మం: న్యాయవాది నుంచి కౌన్సిలర్‌గా

image

కోర్టులో కేసులు వాదించే స్థాయి నుంచి ప్రజల పక్షాన నిలిచే ప్రజాప్రతినిధిగా అడ్వకేట్ దండి శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ తరపున విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో న్యాయవాదిగా సేవలందించిన శ్రీజ, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మిత్రులు ఆమెను అభినందించారు.

News February 18, 2026

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం కలెక్టర్ చొరవ!

image

ఖమ్మం (D)లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్ అనుదీప్ రంగంలోకి దిగారు. బాజుమల్లాయిగూడెం, రేలకాయలపల్లి రైతులతో సమావేశమై భూసేకరణపై చర్చించారు. నిబంధనల మేరకు గరిష్ఠ పరిహారంతో పాటు పంటలు, నిర్మాణాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News February 18, 2026

ఖమ్మం: ప్రభుత్వ ఐటీఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం ప్రభుత్వ ఐటీఐలో పీఎంకేవీవై 4.0 పథకం కింద సీఎన్సీ టర్నింగ్ ఆపరేటర్, డ్రోన్ టెక్నీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు ఎస్సెస్సీ మెమో, ఆధార్ కార్డుతో ఐటీఐలో సంప్రదించాలని కోరారు.